జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి నేడు నామినేషన్ దాఖలు చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆమెకు పార్టీ బీఫాంతోపాటు పార్టీ తరఫున రూ. 40 లక్షల చెక్కు అందించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ముషీరాబాద్, అంబర్పేట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు.. మాగంటి సునీతాగోపీనాథ్ పిల్లలు పాల్గొన్నారు.