సిటీబ్యూరో/బడంగ్పేట్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని ఓ రిసార్ట్స్‌లో నిర్వహిస్తున్న రేవ్‌పార్టీని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం రాత్రి భగ్నం చేశారు. మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ రాకేశ్‌రెడ్డి చంద్రారెడ్డి రిసార్ట్స్ పేరుతో రిసార్ట్స్ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఏపీకి చెందిన ఓ ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి మద్యంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించారు. డీజే సౌండ్లతో రిసార్ట్స్‌లో డ్యాన్స్‌లు చేస్తూ అందులో ఉన్న వాళ్లు కేరింతలు కొడుతుండటంతో భారీగా సౌండ్ వస్తుండడంతో ఆ గ్రామ ప్రజలు డయల్ 100కు ఫోన్ చేశారు.
ఎస్ఓటీ పోలీసులు రిసార్ట్స్‌పై దాడి చేశారు. యువతులు, పార్టీకి వచ్చిన వారితో నృత్యాలు చేస్తూ కన్పించారు. మద్యం బాటిళ్లు లభించాయి, అయితే డ్రగ్స్ కూడా వాడే అకవాశాలున్నాయనే అనుమానంతో ఎస్ఓటీ పోలీసులు, మహేశ్వరం పోలీసులతో కలిసి అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు. 28 మంది పురుషులుండగా 22 మంది యువకులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.