సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కాగా మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.6డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.6 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.