భూపాలపల్లి రూరల్, నవంబర్ 9 : శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాలపల్లిలోని జవహర్‌నగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ శనివారం రాత్రి కారులో చెల్పూర్ వైపు వెళ్తుండగా.. మైసమ్మ గుడి వద్ద అదుపుతప్పి ఢీ వైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో భూపాలపల్లి పర్యటనను ముగించుకొని మంజూర్‌నగర్ క్యాంపు ఆఫీస్‌కు వెళ్తున్న మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వెంటనే తన వాహనాన్ని ఆపి పరిశీలించారు. 108కు ఫోన్‌చేసి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని వంద పడకల దవాఖానకు తరలించారు. శ్రీకాంత్‌కు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.