మహబూబ్‌నగర్ : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని రాజకీయ కక్షులకు దిగుతున్నారని బీఆర్ఎస్ శాసనమండలి పక్ష నేత మధుసూదనాచారి(Madhusudanachari )ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే దివ్యాంగుల ఇండ్లు ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకు మాజీ మంత్రి తమ్ముడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా విభాగం నేత వరద భాస్కర్‌ను సీఐ స్టేషన్‌కు పిలిపించి ఆ కారణంగా కొట్టి బైండోవర్ చేయడం.. దీన్ని ప్రశ్నించినందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు పెట్టడం దారుణమన్నారు.
కాంగ్రెస్ పెద్దల అండదండలతోనే మాజీ మంత్రి శ్రీనివాస్‌పై రాజకీయ కక్షలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతుందన్నారు. లాంటి కేసులకు భయపడబోమని మధుసూదనాచారి స్పష్టం చేశారు.
తనపై తన కుటుంబంపై ఎన్ని కేసులు పెట్టాలో పెట్టుకోండి కానీ దివ్యాంగులకు న్యాయం చేయండి అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షతో తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కేసులు పెడుతుందని అయినా బెదిరేది లేదన్నారు. కేసులు పెట్టినా పర్వాలేదు పేదలకు మాత్రం న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు.