హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై ఇస్తున్న 25% రాయితీ గడువును ఈనెల 31వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌ను ప్రకటించారు. మార్చి 31వరకు ఎల్ఆర్ఎస్పై రాయితీ గడువును మరోసారి పెంచారు. ఆ తర్వాత ఏప్రిల్ 30వరకు పొడిగించారు.
ఆ గడువు కూడా ముగియడంతో.. మే 3 వరకు మూడ్రోజులు పెంచారు. ఇప్పుడు మళ్లీ ఈనెల 31వరకు గడువును పొడిగించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం, ప్రజల నుంచి స్పందనలేకపోవడంతో రాయితీ గడువును పలు దఫాలు పెంచినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.