వానకాలం పంటలు గట్టెక్కేనా.. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఉన్నది 6.8 టీఎంసీలే
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయినిగా నిలిచిన నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండుతున్న ఎండలకు రోజురోజుకూ నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు ఆయకట్టుకు నీటి విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
- ఆందోళన కలిగిస్తున్న ఎల్‌నినో
నిజాంసాగర్, జూన్ 16 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయినిగా నిలిచిన నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండుతున్న ఎండలకు రోజురోజుకూ నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు ఆయకట్టుకు నీటి విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం 1.35 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. వానకాలం పంటలసాగుకు సమాయత్తమవుతున్న రైతులను ఎల్‌నినో ఆందోళనకు గురిచేస్తున్నది.
ఈసారి వర్షపాతం సాధారణం కన్నా తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, బోరుబావులు, ఎత్తిపోతలు, చెరువులు, కుంటలు, ప్రధాన జలాశయాల కింద ముందస్తు పంటలు సాగు చేయవద్దని వాతావరణశాఖ సూచిస్తున్నది. ఆయకట్టు పంటలు గట్టెక్కాలంటే 9 టీఎంసీలు అవసరం. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1405 అడుగుల(17.80 టీఎంసీలు)కుగాను 1394.96 అడుగుల(6.80 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది. దీంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తారో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

