అశ్వారావుపేటలో ప్రేమజంట ఆత్మహత్య..
Telangana | జిల్లా పరిధిలోని అశ్వారావుపేటలో విషాదం నెలకొంది. ఓ ఇద్దరు ప్రేమికులు అశ్వారావుపేట బస్టాండ్లో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మృతి చెందారు.

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని అశ్వారావుపేటలో విషాదం నెలకొంది. ఓ ఇద్దరు ప్రేమికులు అశ్వారావుపేట బస్టాండ్లో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. చంద్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామానికి చెందిన పొర్రొళ్ల జగ్గారావు(28) ఆటో నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు.. జగ్గారావు ఆటోలో చంద్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రతి రోజు వెళ్లేవారు. ఈ క్రమంలో జగ్గారావు.. మాయర అనూష(14) అనే విద్యార్థిని మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనూష చంద్రుగొండ జడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతోంది.
ఆటోలో చిగురించిన ప్రేమ..
అయితే సోమవారం మధ్యాహ్నం సదరు బాలిక పాఠశాలలోనే బ్యాగు వదిలేసి బయటకు వచ్చింది. అనంతరం జగ్గారావుతో కలిసి అశ్వారావుపేటకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం అశ్వారావుపేట బస్టాండ్లో కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు ఆగడంతో.. ప్రేమికులిద్దరూ బస్సెక్కి కూర్చున్నారు. అంతకుముందే వారు పురుగుల మందు సేవించారు. బస్సులోనే ఆ ప్రేమికులు వాంతులు చేసుకోవడాన్ని కండక్టర్ గమనించాడు. దీంతో బస్సు డ్రైవర్ నేరుగా బస్సును పోలీసు స్టేషన్కు తీసుకెళ్లాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన వారిద్దరిని అశ్వారావుపేట ఆస్పత్రికి పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమికులిద్దరూ మృతి చెందారు. ఆటోలో చిగురించిన వారి ప్రేమ ఆర్టీసీ బస్సులో ఆవిరైపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

