రంగారెడ్డి: నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట వద్ద ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ తారామతిపేట వద్ద ఔటర్ రింగురోడ్డుపై (outer ring road) డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో లారీ పూర్తిగా దగ్ధమయింది. ఈ ప్రమాదంతో తారామతిపేట-శంషాబాద్ మధ్య 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసి, ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.