హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో(Peddapally district) విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు(Snake bite) గురై ఓ లారీ డ్రైవర్(Lorry driver) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన శాతరాజుల సతీష్ (39) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా, ఆదివారం రాత్రి కిరాణం షాప్‌కు వెళ్లి వస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సతీష్ మృతితో పాలకుర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read..