నగల షాపు లూటీకి పెద్దపల్లి నుంచే స్కెచ్?
కరీంనగర్లో ఈ నెల 3న పీఎంజే జ్యువెల్లరీలో జరిగిన దోపిడీ ఘటన రోజుకో నలుపు తిరుగుతున్నది. నెల రోజులుగా రెక్కీ నిర్వహించి.. దోపిడీకి పాల్పడినట్టుగా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.
కరీంనగర్ మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ధర్మపురి : కరీంనగర్లో ఈ నెల 3న పీఎంజే జ్యువెల్లరీలో జరిగిన దోపిడీ ఘటన రోజుకో నలుపు తిరుగుతున్నది. నెల రోజులుగా రెక్కీ నిర్వహించి.. దోపిడీకి పాల్పడినట్టుగా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో గత నెలలో మూడుసార్లు బోగస్ ఆధార్ కార్డులు ఇచ్చి రూమ్లు బుక్ చేశారు. ఇక్కడి నుంచే దోపిడీకి రెక్కీ నిర్వహించారు.
ఈ నెల 1న ధర్మపురికి వచ్చి విజయలక్ష్మి వసతి గృహంలో రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. సౌరవార్ కుమార్, జార్ఖండ్ పేరుతో ఉన్న ఆధార్ చూపించారు. ఈ నెల 2న ముఠాకు చెందిన మరో వ్యక్తి హోటల్కు రాగా, గదిలో ఐదుగురు ఉండడానికి ఒప్పుకోమని లాడ్జి యజమాని గుండయ్య అభ్యంతరం చెప్పారు. ఏసీ గదులు ఖాళీ లేకపోవడంతో రూ.600 అద్దె చెల్లించి మొదటి అంతస్తులోని నాన్ ఏసీగదిని అదే సౌరవార్ కుమార్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. ధర్మపురి నుంచి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు వెళ్లే మార్గం ఉండడంతో పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నట్టు అనుమానిస్తున్నారు. చోరీలో ఇప్పటివరకు ఐదుగురు ముష్కరులు మాత్రమే పాల్గొన్నట్టు అనుమానించినా.. లాడ్జి వద్ద లభ్యమైన విరాలను బట్టి చోరీ ఘటనలో ఐదురుగు ప్రత్యక్షంగా పాల్గొనగా, మరో వ్యక్తి బయటి నుంచి సహకరించినట్టు అనుమానిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

