పెనుబల్లి (సత్తుపల్లి), డిసెంబర్ 5 : ఖమ్మం జిల్లా బుగ్గపాడులో గురువారం జరిగిన మెగా ఫుడ్‌పార్క్ ప్రారంభోత్సవంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఒకరినొకరు పొగుడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో విసుగెత్తిన ప్రజలు సభ నుం లేచిపోవడంతో ఖాళీ కుర్చీలే మంత్రుల ప్రసంగాన్ని వినాల్సి వచ్చింది. ముఖ్యఅతిథిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరుకాగా.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. మంత్రులు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడంతో ప్రజలు వెళ్లిపోయారు.