Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో నాలుగో దశలో ఎన్నికలు మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వడగాలులు, ఎండల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు పోలింగ్ సమయాన్ని ఈసీ పెంచింది.