హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): వివాదాల పరిష్కారంలో భాగంగా నిర్వహించే లోక్‌అదాలత్‌ల్లో జారీ చేసే అవార్డు చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని హైకోర్టు తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో స్థిరాస్తికి సంబంధించి అన్నా చెల్లెళ్ల మధ్య వివాదాన్ని పరిష్కరిస్తూ మే డ్చల్ మల్కాజిగిరి జిల్లాలో లీగల్ సర్వీసెస్ అథారిటీ జారీచేసిన అవార్డును సవాలు చేస్తూ కే కల్యాణి, మరొకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అవార్డు చెల్లదంటూ తీర్పు వెలువరించింది.
విపత్తులకు మనుషల చర్యలే కారణం ; అధికారుల తీరుపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత విపత్తులకు ప్రకృతి కారణం కాదని, మనుషుల చర్యలే కారణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. చెరువుల ఆక్రమణలకు అడ్డులేకుండా పోతున్నదని, ఆక్రమణలకు గురవుతున్నాయని, రెవెన్యూ అధికారులు వాటిని నిర్ధారించుకోకుండా పట్టాలు జారీ చే స్తుండటంతో చెరువులు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేసిం ది. అన్నింటికీ రెవెన్యూ అధికారులపైనే ఆధారపడాల్సి వస్తున్నదని, ఆ శాఖను రద్దు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని, పోలీసు శాఖ కంటే దారుణంగా ఉన్నదని వ్యాఖ్యానించింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మం డలం అడవి మల్లెలలో సర్వే నంబర్ 11, 12, 13, 29, 30, 31లోని పట్టా భూమిని మిషన్ కాకతీయ పథకంలో చేర్చడాన్ని సవాలు చేస్తూ బీ సంజీవరెడ్డి, మరో ఏడుగురు రైతులు 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ చేపట్టారు.