లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయాలి : స్పీకర్ పోచారం
స్పీకర్ పోచారం | లాక్ డౌన్‌ను సక్రమంగా అమలు జరిగేలా చూడాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్ : లాక్ డౌన్‌ను సక్రమంగా అమలు జరిగేలా చూడాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ అమలు తీరుపై స్పీకర్ సమీక్షించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని, నసరుల్లాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో తన అధికార నివాసం నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ లాక్ డౌన్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామాల్లో మిషన్ భగీరధ ద్వారా సాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితులలోను నీటి సరఫరాకు ఆటంకం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వచ్చే వానాకాలం పంటల సాగు సన్నద్దతపై పలు సూచనలను చేశారు.
అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందుగానే నిల్వ చేసుకోవాలని అధికారులకు సూచించారు. డబుల్ బెడ్ నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు అవసరమైన సామగ్రిని అందజేయాలని, త్వరితంగా నిర్మాణాలు పూర్తి అయ్యేవిదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే గ్రామాలలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం తెలుసుకుని తగు సూచనలను చేశారు.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్‌సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్‌కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
Medicover Hospital | మెడికవర్.. రేవంత్ బినామీ దవాఖాన : కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
Blue Drum Case | బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడికి మరణ శిక్ష.. మీరట్ కోర్టు సంచలన తీర్పు
India vs West Indies | హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

