CM Revanth Reddy | రామంతాపూర్, సెప్టెంబర్ 28 : ‘పైసా, పైసా కూడబెట్టుకొని ప్లాట్లు కొన్నం.. మా కాలనీలోకి ఎన్నడూ రాని మూసీ నీళ్లు ఇప్పడెట్ల వస్తయ్? మేము కొన్న ప్లాట్లలో కట్టుకున్న ఇండ్లను కూల్చే హక్కు నీకెక్కడిది?.. నీకు ఓట్లేసి గెలిపించింది మా ఇండ్లు కూల్చేందుకా?’ అంటూ రామంతపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్‌నగర్, బాలకృష్ణానగర్, సాబే రా కాలనీ, సాయికృష్ణానగర్ నివాసితులు రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నిలదీస్తున్నారు. కేసీఆర్‌నగర్, మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇం డ్లు కట్టుకున్నవారు కొన్నిరోజులుగా హైడ్రా చర్యలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా రు.
ఎప్పడు తమ ఇండ్లను కూల్చుతారోనని ఆందోళన చెందుతున్నారు. ‘మా ప్రాణాలు పోయినా సరే.. ఇండ్లను కూల్చనివ్వం’ అంటూ తెగేసి చెప్తున్నారు. ఐదు కాలనీలకు చెందినవాళ్లు శనివారం సమావేశానికి యూనిట్‌గా ఏర్పడి అందోళనలకు సిద్ధమైనట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌ను గద్దె దించేవరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాగా మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న నిర్మాణదారులకు ఎలాంటి నోటీలు ఇవ్వలేదని ఉప్పల్ తహసీల్దార్ వాణీరెడ్డి తెలిపారు.