హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లను తేల్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, ఆ మేరకు ప్రభుత్వానికి సూచించాలని తెలంగాణ బీసీ హక్కుల వేదిక కోరింది. ఈ మేరకు సంస్థ కన్వీనర్ కాంభోజీ వెంకటేశ్వర్లు, కో-కన్వీనర్ బైరోజు వెంకటాచారి రాష్ట్ర బీసీ కమిషన్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా బీసీలను దూరం పెడుతున్నారని ఆవేదన చెందారు. గ్రామాల్లో సంచార జాతులు, సేవా కులాలు ఇప్పటికే నిర్వీర్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సర్వేలో అర్బనైజేషన్‌ను పరిగణనలోకి తీసుకున్నారని, అది సహేతుకం కాదని, బీసీ కమిషనే సర్వే చేయాలని కోరారు. ప్రస్తుతం జాబితాల్లో ఉన్న కులాల పేర్లలో మార్పులు చేయాలని కోరారు.
ముదిరాజ్‌ల అభ్యున్నతికి పాటుపడాలి ; జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ముదిరాజ్‌ల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. ముదిరాజ్‌ల చైతన్యమే లక్ష్యంగా చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్రను గన్పార్ వద్ద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో ముదిరాజ్‌లకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ఎకువ మంది కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, వారిని ఆదుకునేలా ముదిరాజ్ కార్పొరేషన్‌కు రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు. శివ, బ్రహ్మ, నారాయణ, రాములు, వెంకటయ్య, పుష్పలత పాల్గొన్నారు.