హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 10వ తేదీ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నదని, తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. హైకోర్టు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీలోపు తాము ఎన్నికలు ముగిస్తామని చెప్పారు.