హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధుల పదవులకు ఎన్నికలు నిర్వహించాలన్న వ్యాజ్యంపై విచారణ మూడు వారాలపాటు వాయిదా వేయాలన్న ప్రభుత్వం వినతికి హైకోర్టు సమ్మతించింది. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పోస్టులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని గత విచారణ సమయం లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు 3 వారాల సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టు ను గురువారం కోరారు.
అందుకు అనుమతిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవులకు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది రాపోలు భాసర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని గురువారం ధర్మాసనం విచారించింది.