మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ (Live Fish Lorry) బోల్తాపడింది. దీంతో జనాలు చేపల కోసం ఎగబడ్డారు. మంగళవారం ఉదయం ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ మరిపెడ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ఉన్న చేపలు మొత్తం రోడుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో బతికున్న చేపల (లైవ్ ఫిష్) కోసం ప్రజలు పోటీపడ్డారు. అందినకాడికి పట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపుచేశారు. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రమాదానికి గురైన లారీ అక్కడి నుంచి తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.