ములుగు, డిసెంబర్ 9 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు వ్యక్తులు సిద్దిపేట జిల్లా ములుగులోని శ్యామ్సుందర్రెడ్డి వ్యవసాయ పొలం వద్ద నిల్వచేసిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్రెడ్డి, ములుగు ఎస్సై రఘుపతి టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి మంగళవారం తెల్లవారుజామున చేపట్టిన దాడుల్లో రూ.7.40 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. ఇందుకు బాధ్యులైన వా రిని అదుపులోకి తీసుకొని కేసు నమో దు చేసినట్టు ఎస్సై రఘుపతి తెలిపారు. కాగా మండల పరిధిలోని చిన్నతిమ్మాపూర్లో రూ. లక్ష విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.