హైదరాబాద్ : న్యూ ఇయర్ వేళా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు(Liquor sales) ఆల్ టైం రికార్డును బ్రేక్ చేశాయి. 2025 డిసెంబర్ నెలలో హైదరాబాద్‌లో(,Hyderabad) ఏకంగా రూ.5,102 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయాని ఎక్సైజ్ అధికారులు వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో మాత్రమే సుమారు రూ.750 కోట్ల వరకు అమ్మకాలు జరగడం విశేషం. దీంతో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఇందుకు గల కారణాలను ఎక్సైజ్ వివరించారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తో పాటు సర్పంచ్ ఎన్నికలు రావడం మద్యం అమ్మకాలపై గణనీయమైన ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. ఈ భారీ ఆదాయానికి మరో ప్రధాన కారణంగా కొత్త మద్యం పాలసీని అధికారులు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం సమకూరిన.. ఇలాంటి పద్ధతుల్లో రావడం ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది సమజంలో అశాంతికి దారి తీసీ అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.