హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ): కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్‌ల జారీ కోసం అక్టోబర్ 8లోగా షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించేందుకు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం కసరత్తు చేస్తున్నది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. అవి ప్రస్తుత జనాభాకు సరిపోవని, దుకాణాల సంఖ్యను పెంచాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా రూ.3,700 కోట్ల ఆ దాయం దాటుతుందని అంచనా వేసింది. దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచినందున మద్యం వ్యాపారులకు నెల రోజులు గడువు ఇవ్వడం ద్వారా ఎకువ దరఖాస్తులు వచ్చేలా చూడాలని, అప్పటికీ తగిన న్ని దరఖాస్తులు రాకపోతే మరో 10 రోజు లు గడువు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నవంబర్ 25 లోగా లైసెన్సుల జారీని పూర్తిచేసి, డిసెంబర్ 1 నుంచి వాటి ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ కసరత్తు చేస్తున్నట్టు సమాచా రం. ఎక్సైజ్ శాఖలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలను డిసెంబర్ రెండో వారం నుంచి చేపట్టాలని కమిషనర్ యోచిస్తున్నట్టు తెలిసింది.