నల్లబెల్లి, సెప్టెంబర్ 21: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి సరిహద్దులో ఉన్న ఏజెన్సీ గ్రామం గొల్లపల్లె సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసి ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో 750 మంది జనాభా ఉండగా.. చాలామంది యువత గుడుంబా, మద్యానికి బానిసై యుక్తవయస్సులోనే మృత్యువాత పడ్డా రు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
మరికొందరు గుడుంబాకు బానిసై కష్టపడి సంపాదించిదంతా తాగుడుకే ఖర్చు చేస్తున్నారు. కుటుంబాలను పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన గ్రామప్రజలు.. గ్రామం బాగుపడాలంటే మద్యపాన నిషేధమొక్కటే మార్గమని నిర్ణయించుకున్నారు. వారం రోజుల క్రితం గ్రామంలో సమావేశమై సంపూర్ణ మద్యపానం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలకతీతంగా గ్రామంలోని యువకులు, గ్రామపెద్దలు సంయుక్త నిర్ణయంతో మద్యపాన నిషేధాన్ని ప్రకటించి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు.