కొండాపూర్, ఆగస్టు 26: విద్యుత్తు మీటర్ కనెక్షన్ కోసం రూ.15 వేలు లంచం తీసుకొంటూ ఓ లైన్మెన్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కొండాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. శ్రీరామ్‌నగర్ కాలనీలో ఓ ఇంటి ప్యానల్ బోర్డు ట్రాన్స్ఫర్, నూ తన విద్యుత్తు మీటర్ కనెక్షన్ కోసం లైన్మెన్ శ్రీనివాస్ రూ. 20 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ముందుగా రూ.5 వేలు చెల్లించారు. మిగతా రూ.15 వేల కోసం ఇబ్బంది పెడుతుండటంతో ఏసీబీని ఆశ్రయించారు. లైన్మెన్ శ్రీనివాస్ శుక్రవారం బాధితుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఈ దాడిలో ఏసీబీ హైదరాబాద్ సిటీరేంజ్-2 డీఎస్పీ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.