వంగూరు, అక్టోబర్ 14 : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు లైన్‌మన్ పట్టుబడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. వం గూరు మండలం మాచినేనిపల్లికి చెందిన రైతు తన పొలంలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ ఏర్పా టు కోసం లైన్‌మన్ నాగేందర్‌ను సంప్రదించాడు. నాలుగు విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించాలని రైతు డీడీలు చెల్లించాడు.
త్వరగా ఏర్పాటు చేయాలని రైతు కోరగా.. రూ. 20వేలు ఖర్చు అవుతుందని చెప్పి రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంగళవారం వంగూరులో లైన్‌మన్‌కు రైతు డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బుధవారం ఏసీ బీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.