నిర్మల్ : గ్రామాల్లో రోడ్లన్నీ బురదమయంగా మారాయని, రోడ్లు బాగు చేయడంలో(Roads repair) అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని నిరసిస్తూ ఆదివారం నిర్మల్(Nirmal) జిల్లా కుంటాల మండలం లింబా(కే) గ్రామస్తులు(Limba (K) Villagers) రోడ్డుపై బురద నీటిలో వరి నాట్లు వేసి తమ నిరసనను (Innovative protest) వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లన్నీ బురదమయంగా ఉండడంతో నడవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న పాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ఇదే విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.