Minister Seethakka | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): శనివారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. గతంలో పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన ఉండగా, ఇటీవల పంచాయతీ ఎన్నికల ముందు ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
శనివారం దీనికి చట్టసవరణ చేశారు. దీంతో ఇద్దరు పిల్లల కన్నా ఎకువ సంతానం ఉన్నా ఇకపై పంచాయతీ, మం డల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి అర్హులేనని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. కాగా, వనపర్తి జిల్లా గోపాల్పేట్ మం డలం జైన్తిరుమలాపూర్ గ్రామం పేరును జయన్న తిరుమలాపూర్గా మార్చే బిల్లును సభ ఆమోదించింది.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం