హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకుని ఆదివారం అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్(ఏఎస్‌టీసీ) ఆధ్వర్యంలో ఐఐసీటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేశారు.
1986లో డీఆర్డీఎల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సతీశ్‌రెడ్డి.. ఆర్సీఐ డైరెక్టర్‌గా, రక్షణ పరిశోధన, అభివృద్ధిశాఖ కార్యదర్శిగా, డీఆర్డీవో చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. పలు క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.