వరంగల్ : జీవితమే ఓ చదరంగం, ఆటల్లో గెలుపు ఓటములు సహజమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ అచ్యుత వనితా పాయి జూనియర్ కాలేజీలో జరుగుతున్న గర్ల్స్ జూనియర్, సీనియర్ చెస్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
క్రీడల్లో గెలుపు ఓటములు సహజం. క్రీడా స్ఫూర్తి ని ప్రదర్శించడం ముఖ్యం అన్నారు. రాజకీయం కూడా ఒక చదరంగమే. మీరు అంతా క్రీడా చదరంగంలో ఉన్నారు. మాలాంటి వాళ్లం రాజకీయ చదరంగంలో ఉన్నామని ఉత్సాహపరిచారు. రాజకీయంగా ఎత్తులు వేయడంలో మీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మంచి పట్టు సాధించాడు అని చమత్కరించారు.
ఏమైనా, ఎత్తులు, పై ఎత్తుల తో కూడిన ఓ అద్భుత క్రీడ చదరంగం. ఈ ఆట మెదడుకు సంబంధించింది. ఈ ఆటలో రాణించేవాల్లు కచ్చితంగా జీవితంలో కూడా రాణిస్తారని మంత్రి తెలిపారు. మీరంతా మీ జీవితాల్లో బాగా ఎదగాలని ఆకాంక్షించారు.
నిర్వాహకులు ఎర్రబెల్లి రామ్ మోహన్ రావును మంత్రి అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలకు మా అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, పిల్లలతో కలిసి మంత్రి కొద్దిసేపు చెస్ ఆడారు.
ఇవి కూడా చదవండి..
Kumrambhim Asifabad | అడా ఎస్బీఐ బ్యాంక్‌లో భారీ చోరీ
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
Mulugu | రోడ్ రోలర్‌ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ అరెస్ట్