భారత్, రష్యా మధ్య రక్షణరంగ ఒప్పందాలు..

న్యూఢిల్లీ: భారత్, రష్యా మధ్య ఇవాళ పలు రక్షణ ఒప్పందాలు జరిగాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షొయిగులు ఆ ఒప్పందాలపై సంతకాలు చేశారు. 7.63x39mm క్యాలిబర్ కలిగిన ఏకే-203 అజాల్ట్ రైఫిళ్ల తయారీ అంశంలోనూ ఇద్దరు రక్షణ మంత్రులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం సుమారు ఆరు లక్షల ఏకే-203 రైఫిళ్లను తయారీ చేయనున్నారు. 2021 నుంచి 2031 మధ్య కాలంలో ఆ ఆయుధాలను సమీకరించనున్నారు. కలష్నికోవ్ ఆయుధాల తయారీ గురించి 2019, ఫిబ్రవరిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏకే-203 రైఫిళ్లను తయారీ చేయనున్నారు. రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగు, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
ఇటీవల కాలంలో ఇండియా, రష్యా మధ్య రక్షణ రంగ సహకారం అసాధారణ రీతిలో ప్రగతి సాధఙంచినట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా అతిపెద్ద భాగస్వామిగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య రక్షణ సహకారం చాలా కీలకమైందని, రెండు దేశాలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తాయని ఆశిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రి తెలిపారు. భారత్, రష్యా మధ్య ఉన్న బంధం దృఢంగా, స్థిరంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

