నల్లగొండ, సెప్టెంబర్ 02ర : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 101 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా మంజూరు అయిన రూ.82,25,800/- (ఎనభై రెండు లక్షల ఇరవైదు వేల ఎనిమిది వందలు) విలువ గల చెక్కులను నేడు నల్లగొండలోని క్యాంప్ కార్యాలయంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరం వంటిదన్నారు. అర్హులు సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.