హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావును హత్య చేసిన నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించటం సబబేనని అటవీశాఖ ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్-తెలంగాణ చాప్టర్, రాష్ట్ర అటవీ అధికారుల సంఘం, అటవీ క్షేత్రాధికారుల సంఘం, జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి.
ఎఫ్ఆర్వో కుటుంబాన్ని ఆదుకొని దోషులకు శిక్ష పడేలా చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి, సీఎం కేసీఆర్‌కు, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి. వేగిర విచారణకు సహకరించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ, పోలీసులను ప్రశంసించాయి. ఏడు నెలల్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించడం హర్షణీయమని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్ తెలిపారు.