సూర్యాపేట సిటీ, సెప్టెంబర్ 1 : సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం సర్పంచ్ జూలకంటి పులిందర్రెడ్డి హత్య కేసులో దోషులు ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2014 జనవరి 30న కోదాడ బైపాస్ రోడ్డులో పులిందర్రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, బంధువుల ఫిర్యా దు మేరకు అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి రిమాండ్‌కు పంపారు.
ఈ మేరకు దోషులకు యావజ్జీవ శిక్షను విధిస్తూ సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జీ రాజగోపాల్ శుక్రవారం తీర్పు వెలువరించారు. విచారణ సమయంలో జలీల్ అనే నిందితుడు మృతి చెందగా మిగతా ఐదుగురు షేక్ షబ్బీర్, కొప్పుల లక్ష్మీనారాయణ, షేక్ ఇబ్రహీం, మాతంగి శ్రీను, నరేందర్‌కు యావజ్జీవ శిక్ష పడింది.