కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): కుమ్ర ంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కాగజ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌కు చెందిన కొత్తపల్లి సదాశివ నకిలీ బీటీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది.
ఈ మేరకు కాగజ్‌నగర్ రూరల్ పోలీస్టేషన్ పరిధిలో పెద్దవాగు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుస్తున్నారు. ఐచర్ వాహనాన్ని సోదా చేయగా సుమారు రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల నకిలీ బీటీ- 3 విత్తనాలు లభించాయి. సదాశివతోపాటు కర్నూల్‌కు చెందిన డ్రైవర్ పుప్పాల లక్ష్మణ్, మహారాష్ట్రలోని అహేరికి చెందిన సంతోష్కిశోర్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన వేణుగోపాల్ రెడ్డి పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు.
జడ్చర్ల టౌన్, మే 24 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లి తండాలోని రెండ్లు ఇండ్లల్లో 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్ తెలిపారు. శనివారం ఆయన జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో సీఐ కమలాకర్‌తో కలిసి మీడియాతో మా ట్లాడారు.
ఈర్లపల్లి తండాకు చెందిన మేఘావత్ చంద్య ఇంట్లో 35 కిలో లు, అతడి కుమారుడు మేఘావత్ రవి ఇంట్లో 15 కిలోల నకిలీ పత్తివిత్తనాలు లభించినట్టు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకొని ఇద్దరినీ పోలీసులకు అప్పగించినట్టు పేర్కొన్నారు.