హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎల్ఐసీని ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 29న రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) డివిజనల్ జాయింట్ సెక్రటరీ డీ గిరిధర్ తెలిపారు. గతంలోనే 3.5శాతం వాటాను విక్రయించారని, ఇకపై విక్రయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. హయత్‌నగర్‌లోని తారా కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారని, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు.