హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలంగాణ ముఖ్యమంత్రి ( Telangana CM ) రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో పోక్సో చట్టాన్ని ( POCSO Act ) పటిష్టంగా అమలు చేయాలని, పోక్సో కేసును నిర్దిష్ట కాలపరిమితి విధించాలని సూచించారు. పోక్సో నిందితుల బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలని, బాధితుల రక్షణకు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
పోక్సో కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ సాక్ష్యాధారాలు మాయం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్(28) తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మను హతమార్చిన అనంతరం తన భార్యను , ఇద్దరు పిల్లలను గొంతులు కోసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను పారిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.