KTR | మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత.. సమానత్వం కోసం కలిసి నడుద్దాం: కేటీఆర్
కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తున్నదని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని చెప్పారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులకు, శ్రామిక లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తున్నదని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని చెప్పారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులకు, శ్రామిక లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మేడే స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచిందని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘కార్మిక సోదరులకు, శ్రామిక లోకానికి హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు. మీ రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుంది, మీ త్యాగం వెలకట్టలేనిది. చారిత్రాత్మక మేడే స్ఫూర్తితో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచింది. సింగరేణి శ్రామికులకు బోనస్‌లు, ఉద్యోగ భద్రత, మెరుగైన సౌకర్యాలతో గౌరవించాం. టీఎస్ఆర్టీసీ కార్మికులకు జీత భత్యాల పెంపు, ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలతో భరోసా కల్పించాం. ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులకు ఆర్థిక సహాయం, సంక్షేమ బోర్డులతో అండగా నిలిచాం. తెలంగాణను పారిశ్రామిక ఆదర్శంగా నిలబెట్టి, లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించాం.
మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచాం. కార్మికుల త్యాగాలకు నివాళిగా, మీ హక్కుల కోసం నిరంతరం పోరాడతాం. ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దాం!’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కార్మిక సోదరులకు, శ్రామిక లోకానికి హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు
మీ రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుంది, మీ త్యాగం వెలకట్టలేనిది!
చారిత్రాత్మక మేడే స్పూర్తితో, @BRSparty
ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచింది.సింగరేణి శ్రామికులకు బోనస్‌లు, ఉద్యోగ భద్రత, మెరుగైన…
— KTR (@KTRBRS) May 1, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Auto Drivers
- BRS
- KTR
- May day
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

