YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
YS Sharmila | కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక ప్యాలెస్ తన బిడ్డల హక్కని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తన కుమార్తె వివాహానికి సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా ఆమె కీలక ప్రకటన చేశారు. యలహంక ప్యాలెస్ నా తండ్రి తిరిగిన ఇల్లని, అందుకే నా కుమార్తె అక్కడే తన వివాహం చేయాలని కోరిందని పేర్కొన్నారు.
YS Sharmila : కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక ప్యాలెస్ తన బిడ్డల హక్కని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తన కుమార్తె వివాహానికి సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా ఆమె కీలక ప్రకటన చేశారు. యలహంక ప్యాలెస్ నా తండ్రి తిరిగిన ఇల్లని, అందుకే నా కుమార్తె అక్కడే తన వివాహం చేయాలని కోరిందని పేర్కొన్నారు. సొంత ఇంట్లో వివాహం చేయడం తల్లిదండ్రుల అదృష్టమని వ్యాఖ్యానించారు.
తన ఇల్లే పెళ్లివేదిక కావాలన్న బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని తాము బాధపడుతున్నామని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. నా కుమార్తె అంజలి వివాహం వివాదం లేకుండా జరిపించాల్సిన బాధ్యత నాపై ఉన్నదని అన్నారు. వివాదం దృష్ట్యా యలహంక ఇంట్లో కాకుండా వేరేచోట నా కుమార్తె వివాహం చేయాలని నిర్ణయించామని చెప్పారు. నాది కాని దాని కోసం ఆశపడే నీచత్వం తనది కాదని అన్నారు. జగన్ సీఎం అయ్యేవరకు యలహంక ప్రాపర్టీ ఉమ్మడిగా ఉందని, ఆస్తుల పంపకాల్లో యలహంక వందశాతం తనకు, తన పిల్లల భాగానికి వచ్చిందనేది దేవుడి సాక్షిగా నిజమని షర్మిల ఎక్స్‌లో పోస్టు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

