హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల సాధనకు 11న ఇందిపార్క్లో తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలని అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి నెహ్రూప్రసాద్ పిలుపుఇచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ (టీజీహెచ్ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా పీ రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శిగా జీ హేమచం ద్రుడు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్టీయూ టీఎస్ అధ్యక్షుడు పర్వత్రెడ్డి ముఖ్య అతిథిగా, జాక్టో చైర్మన్ జీ సదానందంగౌడ్ ఎన్నికల అధికారిగా, జాక్టో సెక్రటరీ జనరల్ కే కృష్ణుడు ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. సంఘం గౌరవాధ్యక్షుడిగా పీ మురళీకృష్ణ, రాష్ట్ర ముఖ్య సలహాదారుగా డాక్టర్ పర్వతి సత్యనారాయణను ఎన్నుకున్నారు.