టేకుమట్ల, ఏప్రిల్17 : ఎల్కతుర్తిలో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభకు టేకుమట్ల మండలం నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి, అబద్ధాల కాంగ్రెస్ను తరిమికొడదామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ విజయవంతం కోసం 200 మంది కార్యకర్తలతో కలిసి గురువారం ఆయన జయశంకర్ భూపాపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణపూర్(టీ) నుంచి వెంకట్రావ్పల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వెంకట్రావ్పల్లి, బూర్నపల్లి, ద్వారకపేట, రామకృష్ణపూర్(వీ), వెలిశాల, గర్మిళ్లపల్లి, రాఘవాపూర్, పంగిడిపల్లి, పెద్దంపల్లి, అశిరెడ్డిపల్లి, టేకుమట్ల, రామకృష్ణపూర్ (టీ), అంకుషాపూర్, సోమనపల్లి, సుబ్బక్కపల్లి గ్రామాల్లో ముఖ్య నాయకులతో సభ విజయవంతంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను రజతోత్సవ సభలో కేసీఆర్ ఎండగడుతారని పేర్కొన్నారు.