హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు వివిధ వర్గాలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమారతో సీఎం చర్చించారు.
తమ ఒకరోజు వేతనాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కే చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి భాసరరావు తెలిపారు.