హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డినే గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పట్టభద్రులను కోరారు.
ప్రజలపక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలిచే ధైర్యం ఆయనకే ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, నిరుద్యోగుల ఆకాంక్షల అమలు కోసం పోరాడాలంటనే రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని కోరారు.