హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఉద్యా న విశ్వవిద్యాల యం మరో వినూ త్న కార్యక్రమంతో రైతుల ముందుకొచ్చింది. ఉద్యాన విద్యార్థులు.. కాలాలు, పంటలవారీగా, సమయానుకూలంగా ఉద్యాన రైతులకు ఆకాశవాణిలో సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
ప్రతి శుక్రవారం ఆకాశవాణిలో సాయంత్రం 7.15 నుంచి 7.30 గంటల వరకు ‘తోట ముచ్చట్లు’పేరున ఈ కార్యక్రమం ప్రసారం కానున్నట్టు వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం మొదటి కార్యక్రమం ప్రసారం కానున్నట్టు చెప్పారు. ఉద్యానరంగం అభివృద్ధిలో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుందని వర్సిటీ డీన్ చీనా తెలిపారు.