KCR Urban Park | ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం అద్భుత ఫలితాలను ఇస్తున్నదని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా అప్పనపల్లిలోని కేసీఆర్ అర్బన్ పార్కు గోల్ బంగ్లా వాచ్ టవర్ దగ్గర చిరుత పులి కనిపించగా, ఆ వీడియోను ఎంపీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. హరితహారంతో గ్రీనరీ పెరగడంతోనే ఇవాళ ఈ దృశ్యం కనిపించింది. తెలంగాణ అంతటా పచ్చదనం పెంచాలనే సీఎం కేసీఆర్ సంకల్పానికి వందనాలు అంటూ సంతోష్ కుమార్ రాసుకొచ్చారు.
🌳The @HarithaHaram, a Brainchild initiative from our Hon’ble CM Sri KCR Sir, is producing incredible results! Check this out👇Today, a #Leopard🐆 was spotted near Gol Bungalow watch tower at KCR Urban Park in Appanapally village, Mahbubnagar district. Kudos to our CM’s… pic.twitter.com/j8M6rLFlXm
— Santosh Kumar J (@SantoshKumarBRS) June 3, 2023