Leopard | శ్రీశైలం : శ్రీశైలం డ్యామ్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. జలాశయం సమీపంలో ఉన్న కేవీ స్విచ్ యార్డ్ వద్ద గత రెండు రోజులుగా చిరుత పులి సంచరిస్తోంది. స్థానికంగా ఉన్న కుక్కల మీద చిరుత దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. చిరుత పులి సంచారంతో స్విచ్ యార్డ్ సిబ్బంది కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
శ్రీశైలం డ్యామ్ సమీపంలో చిరుత పులి కలకలం
శ్రీశైలం జలాశయం సమీపంలో ఉన్న కేవీ స్విచ్ యార్డ్ వద్ద గత రెండు రోజులుగా కుక్కల మీద దాడి చేస్తూ సంచరిస్తున్న చిరుత పులి
భయాందోళనలో స్విచ్ యార్డ్ సిబ్బంది pic.twitter.com/uw2dCyyIX5
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2025