Cheetah | ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో చిరుతపులి సంచరిస్తున్నది. పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. ఆ క్రమంలో ములుగుతో పాటు మదనపల్లి గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పాదముద్రలను గుర్తించామని.. పాదముద్రలను పరిశీలించగా చిరుతవేనని నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఆయా గ్రామాల ప్రజలతో పాటు పశువులకాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని.. రాత్రివేళల్లో చిన్నపిల్లలకు బయటకు పంపొద్దని సూచించారు. ఫారెస్ట్ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఆయా గ్రామాల జనం ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే చిరుతను బంధించాలని కోరుతున్నారు.