నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం(Leopards roamed) కలకలం రేపింది. డిచ్పల్లి మడలం యానంపల్లిలో నిన్న రాత్రి రైతుకు చెందిన పశువులపై దాడి(Cattle attack) చేసి చంపింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిరుత దాడి చేసినట్లు నిర్ధారించారు. చిరుతపులి సంచరించడంపై పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కాగా, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని, రాత్రి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లొద్దని, వెళ్లాల్సి వస్తే వెంట కర్రలు తీసుకుని వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. సిబ్బందితో నిఘా పెట్టామని, చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. చిరుతపుల్లి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.