హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : చట్టసభలు రాజ్యాంగ విలువలను గౌరవించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. పాట్నాలో జరుగుతున్న 85వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో మంగళవారం వారు ప్రసంగిస్తూ.. భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్ రూపొందించిన చట్టాలు ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడుతున్నాయని, చట్టసభలు ప్రజల హకులను రక్షిస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యం, సమన్యాయం, సమానత్వం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. కాన్ఫరెన్స్‌లో శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.