హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): శాసనసభలో గురువారం ప్రభుత్వ శాఖల పద్దులపై చర్చ జరుగనున్నది. తొలిరోజు 12 శాఖల పద్దులపై చర్చించి, సభ ఆమోదం తెలుపనున్నది. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్నం నుంచి పద్దులపై చర్చను ప్రారంభించనున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు.